భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపిఎస్ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల కొరత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్లు 1,275, కండక్టర్లు 789 మంది కొరత ఉందని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఏపిఎస్ఆర్టీసీ లో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకు రావడానికి చర్యలు వేగంగా తీసుకుంటున్నామని వివరించారు.

రాబోయే రోజుల్లో బస్టాండులు ఆధునికీకరణకు చర్యలు
తీసుకుంటామని ఆయన తెలిపారు.