భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..రష్యన్ల స్పెషల్ విషెస్!🇮🇳

అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్! 🇮🇳

భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లోని రష్యన్ వ్యోమగాములు భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్షంలో భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ వారు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆర్య భట్ట నుంచి గగన్యాన్ ప్రాజెక్ట్ వరకు ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న బలమైన అంతరిక్ష సహకారాన్ని వారు కొనియాడారు. రష్యా -భారత్ మైత్రి ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు….