గృహ నిర్మాణాలపై సమీక్ష చేసిన కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి( భారత్ న్యూస్) తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో అర్హులైన పేదల కోసం నిర్మిస్తున్న గృహాల పురోగతిపై కమిషనర్ ఎన్.మౌర్య గృహ నిర్మాణ, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న గృహ నిర్మాణ, నగరపాలక సంస్థ అధికారులు ఆరు లేఔట్లలో నిర్మాణంలో ఉన్న గృహాల పురోగతిని కమిషనర్ కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో అర్హులైన పేదలకు ఇచ్చిన ఇండ్ల నిర్మాణలో పెండింగ్ ఉన్న వాటి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లే ఔట్లలో మౌళిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఆమరయ్య, గృహ నిర్మాణ శాఖ డి.ఈ.లు శ్రీనివాస రావు, మోహన్, ఏ.ఈ.లు, హౌసింగ్ స్పెషలిస్ట్ కాటమరాజు తదితరులు పాల్గొన్నారు.
