భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ….

విశాఖ జిల్లా తగరపువలస గోస్తనీ బ్రిడ్జ్ రైలింగ్ ఢీకొని కారు గోస్తనీ నదిలో పడింది.

స్థానికులు గమనించి తీవ్ర గాయాలతో కారులో ఉన్న డ్రైవర్ ను అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.

అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.

గోస్తనీ నది బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు లేకపోవడం ప్రమాదాలకు కారణం అవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత రాత్రి ఇదే బ్రిడ్జ్ రైలింగ్ ను ఓ వాహనం ఢీకొంది.

ఇప్పటికైనా అధికారులు గోస్తనీ నది బ్రిడ్జిపై విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రమాదానికి గురైన కారు భోగాపురం ఎయిర్పోర్ట్ కు LNT కంపెనీకి సంబంధించినదిగా పోలీసులు గుర్తించారు.

డ్రైవర్ తగరపువలస చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు…