బాలల దినోత్సవం సందర్భంగా దామలచెరువు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిల్స్ అందజేసిన పుల్లూరు ఆనందయ్య,బేబి దంపతులు
పాకాల ( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దాములచెరువు పంచాయతీ దామలచెరువు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు,ఉపాధ్యాయులకు బాలల దినోత్సవం సందర్భంగా వాటర్ బాటిల్స్,స్వీట్స్ ను మొగరాల వాస్తవ్యులు,లైన్స్ క్లబ్ మ్యాంగో దామలచెరువుకు చెందిన పుల్లూరు ఆనందయ్య,బేబీ దంపతుల కుమారుడు పుల్లూరు హరీష్ యు.ఎస్ వెళ్లిన సందర్భంగా గురువారం వారి చేతుల మీదుగా అందజేశారు.మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామలచెరువులో,మండలంలోని అన్ని పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది.లైన్స్ క్లబ్ మ్యాంగో దామలచెరువు వారు పుల్లూరు ఆనందయ్య,బేబీ దంపతులు ఇరువురు విచ్చేసి పిల్లలందరికి మిఠాయిలు,వాటర్ బాటిల్స్ బహుమతులుగా ఇచ్చారు.ఈ సందర్భంగా పుల్లూరు ఆనందయ్య మాట్లాడుతూ కుమారుడు పుల్లూరు హరీష్ యు.ఎస్ వెళ్లినందున నవంబర్ 14న బాలల దినోత్సవం పురస్కరించుకొని దామలచెరువు ప్రాథమిక పాఠశాలలోని పిల్లలకు,ఉపాధ్యాయులకు వాటర్ బాటిల్స్,స్వీట్లు అందజేశామని తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రముఖ పధ్య కవి పత్తిపాటి రమేష్ నాయుడు మాట్లాడుతూ ఈనాటి పిల్లలే రేపటి భావి భారత పౌరులని పేర్కొన్నారు.పాఠశాల తరపున ఉపాధ్యాయులు కలిసి పుల్లూరు ఆనందయ్య,బేబి దంపతులను సన్మానించి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు నాగూర్ భాష,సెక్రటరీ ఆర్.పి నాగూర్,ట్రెజరర్ నిజాం భాష,జెడ్.సి లు కె.ఎస్ మస్తాన్,జి.రామయ్య,సభ్యులు బషీర్,మహమ్మద్,సతీష్,సైదుల్లా,జీ.డి నాగూర్,రెడ్డి భాష,పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సి.పుణ్యవతి,వైస్ చైర్మన్ కరిష్మా,ప్రధానోపాధ్యాయులు విజయ్ మోహన్ రెడ్డెప్ప,ప్రముఖ పద్య కవి పత్తిపాటి రమేష్ నాయుడు,పాధ్యాయులు పాల్గొన్నారు.
