భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..(పంచదారతో కార్డ్ బోర్డ్ మీద నేను వేసిన మదర్ థెరిస్సా చిత్రం)🙏 విశ్వజననీ నీకు వందనం! భారతావని చేసుకున్న ఏ పుణ్యఫలమో నీ ‘పాదస్పర్శ’తో తాను పులకించింది! విదేశంలో పుట్టినా నీ సేవలతో పునీతమైంది మాదేశం! అనాధలకు అమ్మగా, అభాగ్యులకు అండగా, రోగులపాలిట దైవానిగా, నీ సేవలు గైకొన్న ఈదేశం ధన్యతనొందింది! సేవాసధన్ స్థాపించి రోగగ్రస్థులకు నీవు చేసిన సపర్యలు నేటికీ కొనసాగుతున్నాయంటే – నీ శ్రమ వృధా పోలేదు తల్లి! నీ కరస్పర్శతో సపర్యలు పొందిన అదృష్టవంతులకు తెలుసు నీ దైవత్వం! నేడీ ప్రపంచం నీసేవలను గుర్తించినా ఆనాడే తెలుసు పేదజనులకు ఆ దైవం తమకోసం పంపిన “అమ్మ”వు నీవని! సేవలెన్ని చేసినా అమ్మ కోరేది ప్రేమపూరితమైన “అమ్మ”అనే పిలుపు మాత్రమే! అందుకే నువ్వు “విశ్వమాత”వయ్యావు! అందరినోట “లోకజనని”గా కీర్తింపబడ్డావు! (నాకెంతగానో ఇష్టమైన మధర్ థెరీస్సా” జయంతిని పురస్కరించుకొని ఆ తల్లికి కొన్ని అక్షరపుష్పాలు సమర్పిచుకొంటున్నాను)
