భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటం కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో సొంతం చేసుకున్నారు..

జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో 52 మంది పోటీదారులను అధిగమించి విజేతగా నిలిచారు. నవంబర్‌లో ప్యూర్టోరికోలో జరిగే మిస్ యూనివర్స్ పోటీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.
తొలి రన్నరప్‌గా వైష్ణవి గణేశ్, రెండో రన్నరప్‌గా అనుశ్రీ సాతవ్లేకర్, మూడో రన్నరప్‌గా తేజస్విని శ్రీవాస్తవ నిలిచారు.