భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం

నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది.

భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది…..