భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఐదురోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.

దీని ప్రభావంతో ఆగస్టు 22 నుంచి 27 వరకు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం లేదని, అయితే ఈదురుగాలులు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.

తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో, రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులను అప్రమత్తం చేశారు….