భారత్ న్యూస్ విజయవాడ..తక్షణమే IR ప్రకటించాలి: APTF యూనియన్
ఏపీలో ఎన్డిఎ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలైనా ఇంకా టీచర్లు, ఉద్యోగులకు ఎలాంటి భరోసా కల్పించలేదని
APTF ఆరోపించింది.
పెండింగ్ డిఎలు,వేతన సవరణగడువు రెండేళ్లు దాటినా ఇంకా నిర్ణయం తీసుకోలేదని మండిపడింది.
గత ప్రభుత్వం నియమించిన PRC
కమిషన్ ఛైర్మన్ ప్రభుత్వం మారిన తర్వాత రాజీనామా చేశారని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరింది.
PRC ప్రకటించే వరకూ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేసింది.
