..భారత్ న్యూస్ అమరావతి..గంజాయి నియంత్రణకు మా ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది అది మా చిత్తశుద్ధి. ఇంటర్ కాలేజ్ విద్యార్థులకు ఉచితంగా బాగ్స్, పాఠ్యపుస్తకాలు గత వైకాపా ప్రభుత్వం రద్దు చేస్తే, మేము మళ్ళీ పునరుద్దరించాం. పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని మళ్ళీ అమలు చేస్తున్నాం. ప్రీ మెట్రిక్,పోస్ట్ మెట్రిక్,స్కాలర్ షిప్ లు వీటన్నిటిని కూడా మా ప్రభుత్వం విడుదల చేసింది.
సుమారు 6,000 దేవాలయాలకు సంబంధించి ధూప దీప నైవేద్యాలకు గత ప్రభుత్వం ఐదు వేలు ఇస్తే, కూటమి ప్రభుత్వం రూ.10,000 ఇస్తుంది. అర్చకులకు పదివేల నుంచి రూ.15,000 ఇస్తుంది మా ప్రభుత్వం. – మంత్రి పయ్యావుల కేశవ్…
