భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు.. బిగ్ అప్డేట్

A RAJASEKAR.SR Correspondent Vijayawadaఏపీలో మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైంది. దీనిలో భాగంగా జిల్లా అధికారులు నియోజకవర్గాల వారీగా ఓటరు జాబితాల రూపకల్పన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. సంబంధిత నివేదికలు అందించాలని జడ్పీ సీఈఓ జ్యోతిబసు అధికారులను ఆదేశించారు.