భారత్ న్యూస్ విజయవాడ..అన్నమయ్య జిల్లా మదనపల్లె

సిటిఎం పెద్ద చెరువులో విషం కలిపి చేపలు చంపిన దుర్మార్గుడు
లక్ష లాది చేపలు మృత్యువాత పడి నీళ్లలో తేలాడుతున్న వైనం
చెరువులో నీళ్లు విషతుల్యం కావడంతో పశువుల కాపర్లు ఆగ్రహం వ్యక్తం
చెరువులో విషం కలిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు

ఓ దుర్మార్గుడు తన స్వార్థానికి చెరువులో విషం కలిపాడు. అవి చనిపోయి తేలడంతో పట్టుకుని వెళ్లి మార్కెట్లో సొమ్ము చేసుకున్నాడు. తొలిరోజు చావని ఆ మరుసటి రోజు చనిపోయి. దుర్గంధం వెదజలతో చెరువు అంత విసతుల్యంగా మారింది.. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా, మదనపల్లె మండలంలోని సిటిఎం పెద్ద చెరువులో చాపలకు వేలం పాట పాడిన దుర్మార్గుడు నీళ్లలో బస్తాల కొద్ది మందులు కలిపాడు. చనిపోయి తేలడంతో ఒకే రోజు పట్టుకుని వెళ్లి మార్కెట్ లలో అమ్ముకున్నాడు. దీంతో చెరువులో నీళ్లు విషతుల్యంగా మారడమే కాకుండా, తప్పించు కున్న లక్షలాది చేపలన్నీ మరుసటి రోజు మృత్యువాత పడ్డాయి. చనిపోయిన చేపలు కుళ్ళి నీళ్లలో తేలియాడుతూ కనిపించడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.