భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…కలెక్టర్లకు ఉద్యమ కార్యాచరణ నోటీసులిచ్చాం
— ఏపీ ఐకాస అమరావతి

ఈనాడు, అమరావతి: ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రకటించిన తొలిదశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లాల కలెక్టర్లకు సోమవారం నోటీసులు అందజేశామని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్, ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు తెలిపారు. “సెప్టెంబరు 15 నుంచి వర్క్ టు రూల్ కార్యక్రమాన్ని అమలుచేస్తామని కలెక్టర్లకు వివరించాం. 1వ తేదీ నుంచి ‘సీఎం సర్.. మా డబ్బులు మాకు ఇవ్వండి’ అనే నినాదాన్ని వాట్సప్ డీపీగా పెట్టుకుని, ప్రభుత్వం దృష్టికి ఉద్యోగుల ఆవేద నను తీసుకెళ్తాం. 5వ తేదీ వరకు ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి” అని కోరారు.