భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఇంట్లో నుండే ఆధార్ లింక్‌డ్ మొబైల్ నెంబర్ మార్చుకునే విధానం
స్టెప్ – 1
▪️కొత్త ఆధార్ యాప్‌ను(mAadhaar app) ఉపయోగించి ఆధార్‌కు అనుసంధానించిన మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు.
▪️ముందుగా కొత్త ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఆపై ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
▪️ఆ తరువాత ఈ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. ఇందుకోసం ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
స్టెప్ – 2
▪️ఆ తరువాత ఫేస్ అథెంటికేషన్ ద్వారా యాప్‌లోకి లాగిన్ అవ్వొచ్చు.
▪️లాగిన అయిన తరువాత యాప్‌లో చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. సర్వీసెస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
▪️ఆ తర్వాత అక్కడ మొబైల్ నంబర్ అప్‌డేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ – 3
▪️ఆ తర్వాత మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి కొనసాగించు (Continue) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
▪️ఆధార్‌తో అనుసంధానం చేయాలనుకుంటున్న మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
▪️ఇప్పుడు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దానిని ఇక్కడ ఎంటర్ చేయాలి.
స్టెప్ – 4
▪️ఇప్పుడు మీరు ఫేస్ రికగ్నిషన్ (ఫేస్ ధృవీకరణ) చేసుకోవాలి.
▪️ఆ తర్వాత రూ. 75 ఆన్‌లైన్ ఫీజు చెల్లించాలి.
▪️ఫీజులు చెల్లించిన తర్వాత సమర్పించండి(Submit) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
▪️15 రోజుల్లోగా మీ కొత్త మొబైల్ నంబర్ ఆధార్‌లో అప్‌డేట్ అవుతుంది.
గమనిక: ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ పని చేస్తున్నట్లయితే మీరు ఆధార్ యాప్ ద్వారా కొత్త మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ నంబర్ మనుగడలో లేకపోయినట్లయితే.. కొత్త మొబైల్ నంబర్ లింక్ చేయడం కోసం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.
