భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..శాంతిభద్రతలపై నేడు సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు సుమారు 1,300 మంది అధికారులు పాల్గొంటారు.

మహిళలు, చిన్నారులపై నేరాలు, సైబర్ క్రైమ్, గంజాయి వంటి అంశాలపై సీఎం సమీక్షించి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

క్షేత్రస్థాయి సమస్యలు, నేరాల నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది…