భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.వరికి బీమా గడువు ఇక నాలుగు రోజులే!

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువు ఈ నెల 15తో ముగియనుంది.

ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి సాగు రైతులు పంటల బీమాలో నమోదు చేసుకోవటానికి ఇదే చివరి అవకాశం.

గడువు లోగా బీమా ప్రీమియం చెల్లిస్తే.. ఈ-పంట నమోదు వివరాలను తర్వాతైనా చేయించుకోవచ్చని వ్యవసాయ శాఖ తెలిపింది.

ముందస్తు పంటల బీమాకు ఈ-పంట నమోదు అవసరం లేదని స్పష్టం చేసింది.

కేవలం పంట సాగుపై స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించి, గడువులోగా బీమా ప్రీమియం చెల్లిస్తే చాలని పేర్కొంది.

ఎల్.నినో పరిస్థితుల్లో ఆర్థిక భరోసా కోసం ప్రతి రైతు పంటల బీమాలో నమోదు కావాలని సూచించింది.

కాగా, పప్పు ధాన్యాల కొనుగోలుకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని స్పష్టం చేసింది.

ఫార్మర్ ఐడీ క్యూఆర్ కోడ్ను డౌన్లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేయించుకోవాలని సూచించింది.