బద్వేలలో విద్యార్థినిపై జరిగిన ఘటన చానా బాధాకరం మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గజ్జెల వెంకట లక్ష్మి

▪️సరిగా కొద్దీ వారాల క్రిందట అత్త కోడళ్ళు ఫై గ్యాంగ్ రేప్ మరువక ముందే మరో యువతీ పై నిప్పు అంటించిన ఘటన …❓

▪️ఏపీ వ్యాప్తంగా పెరిగిపోతున్న గ్యాంగ్ రేప్ లు,అత్యాచారయత్నలు..?

▪️మైనర్లు పై పెరిగిపోతున్న అత్యాచారలు …❓

తిరుపతి( భారత్ న్యూస్ ) కడప జిల్లా గోపవరం మండలంలో దారుణం జరిగింది. సెంచురి ఫ్లైవుడ్‌ కంపెనీ సమీపంలో ఓ బాలికపై అటవీ ప్రాంతంలో విద్యార్థినికి నిప్పంటించారు. వీటిపై మహిళా కమిషన్ నెంబర్లు ఎందుకు స్పందించట్లేదు మహిళా సమస్యలపట్ల మహిళల యొక్క హక్కుల పట్ల నిరంతరం పనిచేస్తున్న మహిళా కమిషన్ చైర్పర్సన్ ను తొలగించి కనీసం ఎక్కడైనా ఇటువంటి దారుణ ఘటనలు జరిగినప్పుడు కూడా కనీస స్పందన లేని ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉంటే ఎందుకు మహిళా హోం మంత్రి ఉండి మహిళా కమిషన్స్ లో మెంబర్స్ ఉండి కూడా ఎందుకు స్పందించట్లేదు. మాజీ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గజ్జెల వెంకట లక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు..