భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.కొత్త పింఛన్లకు తొలిరోజు 75 వేల దరఖాస్తులు
ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద పింఛనుకోసం తొలిరోజు కొత్తగా 75 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సోమవారం నుంచి ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ధ్రువీకరణ పత్రాలు తీసుకుని ఉదయం నుంచే సచివాలయాల వద్ద దరఖాస్తుదారులు బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఒకేసారి ఎక్కువ మందివి దరఖాస్తు చేసేందుకు ప్రయత్నించడంతో సర్వర్ నెమ్మదించింది.
