భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ALERT: నేడు ఏపీలో పిడుగుల వాన….
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రవ్యాప్తంగా శనివారం మేఘవృతమైన వాతావరణంతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.
వర్షం కురిసే సమయంలో గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది…
