:-

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఉత్తమ బోధనతో జిల్లా స్థాయి గుర్తింపు పొందిన సీతా వెంకట నాగలక్ష్మీ

ఘంటసాల:-

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుకు ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామంలోని మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల (ఆర్)లో ఎస్జీటీగా పని చేస్తున్న ఉపాధ్యాయురాలు కూరపాటి సీతా వెంకట నాగలక్ష్మీ ఎంపికయ్యారు.

సెప్టెంబర్ 5వ తేది ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం జడ్పీ కన్వెన్షన్ హాల్లో జరిగే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందించనున్నారు.

వీరు చేస్తున్న పాఠశాలలో 52 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు.

విద్యా బోధనలో ప్రతిభ, విద్యార్థుల అభ్యసనాభివృద్ధి, పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని వీరిని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డుకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.

కాగా సీతా వెంకట నాగలక్ష్మి భర్త మామిడిపాక సురేష్ పమిడిముక్కల మండలం ఐనపూరులో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు.

ఉత్తమ ఉపాధ్యాయినీగా ఎంపికైన సీత వెంకట నాగలక్ష్మీని సహోపాధ్యాయులు అభినందించారు.