భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..విశాఖలోని యారాడ బీచ్‌‌లో యువకుడి గల్లంతు

Aug 30, 2026,

ఆంధ్రప్రదేశ్ : విశాఖపట్నంలోని యారాడ బీచ్‌లో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వచ్చి స్నానానికి దిగిన నలుగురిలో ఒక యువకుడు అలల తాకిడికి గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడిని ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఆవిరల్ సింగ్‌గా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న న్యూ పోర్ట్ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని, స్థానిక జాలరులు, కోస్ట్ गार्ड సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.