భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..వాహనదారులకు బిగ్ అలర్ట్.. నంబర్ ప్లేట్ తేడా ఉంటే క్రిమినల్ కేసు…
వాహనదారులకు బిగ్ అలర్ట్.. నంబర్ ప్లేట్ తేడా ఉంటే క్రిమినల్ కేసు
తెలంగాణ : హైదరాబాద్‌లో నకిలీ, ట్యాంపరింగ్ చేసిన, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు.
ప్రత్యేక తనిఖీల్లో భాగంగా గత వారం ఆరు క్రిమినల్ కేసులు నమోదు చేసి, పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు ప్రభుత్వం అనుమతించిన HSRP నంబర్ ప్లేట్లనే ఉపయోగించాలని, నంబర్లు కనిపించకుండా చేయడం, ప్లేట్‌ను మార్చడం, స్టిక్కర్లు లేదా అనధికారిక ప్లేట్లు వాడితే క్రిమినల్ కేసులతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు…
