భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..థియేటర్లో మద్యం సేవించి మహిళపై దాడి.. భయాందోళనలో ఫ్యామిలీ ఆడియన్స్!
భద్రాచలంలోని ఏషియన్ థియేటర్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
‘ఇరుముడి’ సినిమా చూస్తున్న సమయంలో కొంతమంది వ్యక్తులు మద్యం సేవించి వచ్చి ఓ మహిళపై దాడికి పాల్పడినట్లు అక్కడ ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఆరోపిస్తున్నారు.
ప్రశాంతంగా సినిమా చూడాలని కుటుంబ సభ్యులతో, చిన్నపిల్లలతో థియేటర్‌కు వచ్చిన తమకు ఇలాంటి ఘటనలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సినిమా థియేటర్లో కూడా ప్రశాంతంగా సినిమా చూసే పరిస్థితి లేకపోతే ఇక కుటుంబాలతో బయటకు రావడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఫ్యామిలీ ఆడియన్స్ వాపోతున్నారు.
ఈ ఘటనతో థియేటర్‌కు వచ్చిన మహిళలు, చిన్నపిల్లలు సైతం భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది.
ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై థియేటర్ యాజమాన్యం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఫ్యామిలీ ఆడియన్స్ కోరుతున్నారు.
ప్రశాంతంగా సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు భద్రత కల్పించాలి.. థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించే ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు….
