భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..హైదరాబాద్‌లో ఇక రాత్రంతా ఆర్టీసీ బస్సులు.. 6 రూట్లలో సేవలు

సెప్టెంబర్ 1 నుంచి హైదరాబాద్‌లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి.

పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా తొలుత ఆరు రూట్లలో ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు.

సికింద్రాబాద్-కొండాపూర్, బాచుపల్లి-వేవ్‌రాక్, సికింద్రాబాద్-హయత్‌నగర్, కోఠి-పటాన్‌చెరు, కోఠి-హైటెక్‌సిటీ, సికింద్రాబాద్-పటాన్‌చెరు రూట్లలో బస్సులు నడుస్తాయి.