భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..నేడు ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు

నేడు ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్ర ప్రజలకు అలర్ట్. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, శనివారం అల్పపీడనం ఏర్పడనుందని IMD వెల్లడించింది.

దీని కారణంగా శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. రైతులు పొలాల్లో చెట్ల కింద ఉండరాదని అధికారులు సూచిస్తున్నారు….