భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..విశాఖలో 4 ఏళ్ల బాలిక కిడ్నాప్

అర్ధరాత్రి రైల్వే స్టేషన్ సమీపంలో ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రులతో నిద్రిస్తున్న బాలికను కిడ్నాప్ చేసిన యువతీ, యువకుడు

విజయవాడకు చెందిన సయ్యద్ అబ్దుల్ హఫీజ్ గని, సయ్యద్ శేషమ్మ భార్యాభర్తలు.. షాపులకు ధూపం వేస్తూ జీవనం సాగిస్తుండగా మూడు రోజుల క్రితం విజయవాడ నుంచి విశాఖ వచ్చి రైల్వే స్టేషన్ ఎదురుగా గల బస్టాప్‌లో రాత్రిపూట వారి అమ్మాయి(4)తో కలిసి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నారు

సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, ఎస్.రాయవరం చెందిన ప్రతిభ, గరివిడికి చెందిన ఉపేంద్ర అనే ఇద్దరు స్కూటీ (AP39 CL 1728)పై వచ్చి అమ్మాయిని గాజువాక వైపు తీసుకెళ్తున్నట్టు గుర్తింపు

స్కూటీ నంబర్ ఆధారంగా విచారణ చేస్తున్న పోలీసులు…..