భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..తిరుపతి జిల్లా పోలీసు శాఖ
తిరుమల :-

Ammiraju Udaya Shankar.sharma News Editor…తిరుమలలో అనధికారిక హాకర్లు, యాచకులపై ప్రత్యేక చర్యలు – 40 మంది తరలింపు.

  • భక్తుల భద్రత, సౌకర్యం మరియు తిరుమల పవిత్రత పరిరక్షణకు ప్రత్యేక తనిఖీలు.
  • అనధికారికంగా హాకింగ్ చేస్తున్నవారు, యాచకులు కలిపి 40 మంది గుర్తింపు.
  • కౌన్సెలింగ్ నిర్వహించి తిరుమల నుంచి కిందికి తరలింపు.
  • అనధికారిక కార్యకలాపాలపై నిరంతర నిఘా – ఉల్లంఘనలకు కఠిన చర్యలు.

తిరుపతి ఆగష్టు: తిరుమలలో భక్తుల భద్రత, సౌకర్యం మరియు తిరుమల పవిత్రతను పరిరక్షించే లక్ష్యంతో తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు మరియు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ మురళీకృష్ణ, ఐపీఎస్., గార్ల ఆదేశాల మేరకు, తిరుమల డీఎస్పీ గారి పర్యవేక్షణలో తిరుమల పోలీసులు మరియు టీటీడీ విజిలెన్స్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో తిరుమలలో అనధికారికంగా హాకింగ్ చేస్తూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నవారు, అలాగే యాచకులను కలిపి సుమారు 40 మందిని గుర్తించి తిరుమల నుంచి కిందికి తరలించారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, తిరుమలలో అనుమతులు లేకుండా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడరాదని అధి