భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు… జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత

తీరప్రాంతాల్లో గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం… ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత

సముద్రం అలజడిగా ఉండే అవకాశం… మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించి వేటకు వెళ్లొద్దు: అనిత

తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి… పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేయాలి: హోంమంత్రి

ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ప్రథమ ప్రాధాన్యం… పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలి: హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత