భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: నారా లోకేష్

Ammiraju Udaya Shankar.sharma News Editor…త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. పంచాయతీ నుంచి ఢిల్లీ వరకు కూటమి ప్రభుత్వం ఉంటే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందన్నారు. కూటమి ఐక్యతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. అధికారం ఉందనే అహంకారం లేకుండా ప్రజల్లోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యకర్తలంతా కుటుంబ సభ్యుల్లా కలసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని, కష్టపడే ప్రతి ఒక్కరి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు.