భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..దేశంలో పెరిగిపోతున్న చక్కెర ధరలు.
దేశంలో చక్కెర ధరలు ఇటీవలి కాలంలో భారీగా పెరిగిపోతున్నాయి. నెల రోజుల్లో దాదాపు రూ.10 వరకు పెరిగినట్లు అంచనా. అయితే, చక్కెర ధరలు పెరగడానికి ఇథనాలే కారణమనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, చక్కెర ధరల పెంపునకు, ఇథనాల్‌కు సంబంధం లేదని కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహారం, సరఫరా శాఖ తెలిపింది.

ఈ మేరకు శుక్రవారం దీనిపై ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశంలో చక్కెర ధరల పెరుగుదలకు గల కారణాలను వివరించింది. చక్కెర ఉత్పత్తి తగ్గిపోవడం, పండుగల సీజన్ కావడంతో డిమాండ్ భారీగా పెరగడం, వాతావరణ సమస్యల కారణంగా పంట నష్టపోవడం, అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థ కఠినంగా మారడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని కేంద్రం చెప్పింది. ఇథనాల్ ఉత్పత్తికి, చక్కెర ధరల పెరుగుదలకు సంబంధం లేదని స్పష్టం చేసింది. గత జూలై 20న కిలో చక్కెర ధర సగటున కేజీకి రూ.48.18 పైసలు ఉండగా, ప్రస్తుతం కేజీ ధర రూ.55.70గా ఉంది.