భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..లాసాన్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం
స్విట్జర్లాండ్లోని లాసాన్లో జరిగిన డైమండ్ లీగ్ 2026లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచారు. కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్, శ్రీలంకకు చెందిన రుమేష్ తారంగ పతిరాగే 88.14 మీటర్ల త్రో చేసి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. కాగ, నీరజ్ 88.05 మీటర్లతో కేవలం 0.09 మీటర్ల (9సెం.మీ) స్వల్ప తేడాతో రెండో స్థానానికి పరిమితం అయ్యాడు. నీరజ్ గాయం నుంచి కోలుకుంటున్నారు.
