భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..విశాఖ:
యూరప్ దేశాల్లో ఉద్యోగాలు పేరుతో నిరుద్యోగుల నుండి భారీగా వసూళ్లు చేసిన కిలాడి లేడీ
ఫ్లయింగ్ బోర్డర్స్ అనే సంస్థ ద్వారా నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన సౌజన్య అనే మహిళ
ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నిరుద్యోగులను నిండా ముంచిన వగలాడి
విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువత నుంచి కోట్లాది రూపాయల వసూళ్లు
ఒక్కొక్కరి నుంచి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసిన ఫ్లయింగ్ బోర్డర్స్ నిర్వాహకురాలు సౌజన్య
తన కార్యాలయంలో టీమ్ ను పెట్టి ఉద్యోగం వచ్చినట్లుగా మెయిల్ పంపి నమ్మంచిన సౌజన్య
ఎంతకీ ఉద్యోగాలు రాకపోయేసరికి పోలీసులను ఆశ్రయించిన బాధితులు
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ద్వారక పోలీసులు
సర్చ్ వారెంట్ తో కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తాడిగడప లోని సౌజన్య ఇంటికి వెళ్లిన విశాఖ పోలీసులు
అరెస్టు చేసి విశాఖకు తీసుకువచ్చిన పోలీసులు
బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలని పోలీసులు పిలుపు
