భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత : విక్కుర్తి
అవనిగడ్డ, ఆగస్టు 22: అవనిగడ్డ గ్రామంలోని 7వ వార్డులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ ఆంధ్ర సాధన ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఇళ్ల పరిసరాలు, వీధులు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. పరిశుభ్రమైన పరిసరాలతోనే ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అవనిగడ్డ నియోజకవర్గం పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
