భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…అమరావతికి ‘ఐకానిక్’ రూపం..శరవేగంగా రాజధాని నిర్మాణ పనులు..!

Ammiraju Udaya Shankar.sharma News Editor…అత్యాధునిక టెక్నాలజీతో ఐకానిక్ టవర్స్ నిర్మాణం.. ఒక్కో అంతస్తు 10 రోజుల్లో పూర్తి చేసే లక్ష్యం.

49 అంతస్తులతో GAD టవర్.. 39 అంతస్తులతో మరో 4 HOD టవర్లు.

ఐదు టవర్లను కలుపుతూ 900 మీటర్ల గ్లాస్ బ్రిడ్జి ప్రత్యేక ఆకర్షణ.

డయాగ్రిడ్, జంపింగ్ ఫార్మ్‌వర్క్, మివాన్ షట్టరింగ్ వంటి ఆధునిక నిర్మాణ సాంకేతికతల వినియోగం.

2027 ఆగస్టు నాటికి ప్రధాన నిర్మాణాలు.. 2028 మార్చి నాటికి పూర్తి ప్రాజెక్టు లక్ష్యం.

అసెంబ్లీకి బౌద్ధ స్థూపం ఆకృతి.. హైకోర్టుకు రాజహంస ఆకృతిలో డిజైన్.

సీడ్ యాక్సెస్ రోడ్డు, భారీ స్టీల్ బ్రిడ్జిలు ఇప్పటికే అందుబాటులోకి.

వరద ముప్పును తగ్గించేలా ‘స్పాంజ్ సిటీ’ కాన్సెప్ట్.. 51 శాతం ప్రాంతంలో పచ్చదనం, నీటి వనరులు.

విద్యుత్, ఇంటర్నెట్, గ్యాస్, నీటి పైప్‌లైన్ల కోసం అండర్‌గ్రౌండ్ డక్ట్ టన్నెల్స్.

ఏఐ కమాండ్ కంట్రోల్‌తో ట్రాఫిక్, భద్రత, వీధి దీపాల పర్యవేక్షణకు ప్రణాళిక.

రూ.50,999 కోట్ల అంచనా వ్యయంతో 95కి పైగా ప్రధాన ప్రాజెక్టులు.. 2028 నాటికి కీలక పనుల పూర్తి లక్ష్యం.

2050 నాటికి 35 లక్షల జనాభా, 15 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో గ్లోబల్ స్మార్ట్ సిటీగా ‘అమరావతి’.