.

..

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..కృష్ణా జిల్లా,, ఉయ్యూరు..

ఉయ్యురు లో అతిసారం కలకలం రేపుతున్న వేళ.. బాధితులను పరామర్శించేందుకు మంత్రి పొంగురు నారాయణ కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చేరుకున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.
అతిసారం వ్యాప్తికి గల కారణాలపై అధికారులను మంత్రి ఆరా తీసి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

మంత్రి నారాయణ కామెంట్స్…

ఉయ్యూరులో డయేరియా అని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు…

దయవుంచి నిజాలు తెలియజేయండి..

ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో 11 మందికి విరోచనాలు ఆయన మాట వాస్తవం…

ఈ 11 మందిలో బోల్లపాడు, కుందేరు… కాటూరు, కనుమురు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు..

ఉయ్యూరు మున్సిపాలిటీకి చెందిన వ్యక్తులు ఆరుగురు ఉన్నారు..

అన్ని ప్రాంతాలకు మంచినీటి సరఫరా వేరుగా వస్తుంది..

గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ లేక ఆర్వో వాటర్ ప్లాంట్ల ద్వారా సప్లై చేసిన మంచినీటితో వచ్చిందా అనే విషయమై పరీక్షలు నిర్వహిస్తాం..

చికిత్స పొందుతున్న అందరి ఆరోగ్యం నిలకడగా ఉంది..

సోషల్ మీడియాలో వ్యక్తి చనిపోయాడు అని వస్తున్న వార్తలు అవాస్తవం..

విజయవాడలో గుండె సంబంధిత వ్యాధితో ఉయ్యూరు కు చెందిన ఒక వ్యక్తి చనిపోయాడు.. ఈ వ్యక్తికి ఈ సంఘటనకు ఎటువంటి సంబంధం లేదు..

అమృత్ స్కీం విధానంలో త్వరలోనే మున్సిపాలిటీలోని పైపులైన్లను పునరుద్ధరిస్తాం..