భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..23 అర్ధరాత్రి నుంచి తెలంగాణ లో ఆటో బంద్ , స్కూల్ వ్యాన్ బంద్ కు మద్దతు ఇవ్వాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు యన్.రామచంద్ర రావు గారిని కలిసిన జాక్ నేతలు రవిశంకర్ అల్లూరి,ఆర్ల సత్తిరెడ్డి వెంకటేష్, మారయ్య, ముకేష్ గౌడ్, మాజిద్, పెంటయ్య,శ్రీధర్ రెడ్డి తదితరులు. ఈ సందర్భంగా రామచంద్ర రావు మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వలన ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.23 అర్ధరాత్రి నుండి జరిగే ఆటో సమ్మెకు బిజెపి పూర్తి మద్దతు ఉంటుందని తెలియచేశారు.
అనంతరం TRS అధ్యక్షులు కవిత బిసి సంఘాల నాయకులు కిష్టయ్య ను కలసి మద్దతు కోరగా వారు సమ్మతించారు.సంపూర్ణ మద్దతు ప్రకటించారు.