భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..విష్ణు సహస్ర నామము జన్మ నక్షత్ర పాదముల ప్రశ్నోత్తర మాలిక
1.విష్ణు సహ స్ర నామ స్తోత్రమును జన్మ నక్షత్ర పాదమును బట్టి శ్లోకములను పఠిం చవచ్చునా?
విష్ణు సహస్ర నామమును చదివిన తరువాత మన జన్మ
నక్ష త్రమును అనుసరించి విష్ణు సహస్ర నామమును పఠించవచ్చును.
2.ఉత్తరాషాడ నక్ష త్రము మెుదటి పాదము వారికి సంబంధించిన శ్లోకము నువివరించండి?
తేజో వృషోద్యుతిధరః సర్వ శస్త్ర భృతాం వరః
ప్రగ్ర హో నిగ్రహా వ్యగ్రో నైక శృంగో గదాగ్రజః
3.ఈ శ్లోకము యెుక్క అర్ధమును వివరించండి?
తేజః. ప్రకాశించే తేజస్సు గలవాడు
వృషః.. ధర్మ స్వరూపుడు లేదా కోరికలను తీర్చు వాడు
ద్యుతిధరః.. కాంతిని ధరించిన వాడు
సర్వశస్త్ర భృతాం వరః.. అన్ని ఆయుధాలు ధరించిన వారిలో శ్రేష్టు డైన వాడు
ప్రగ్రహః.. భక్తు ల యింద్రి యాలను మనసును నిగ్ర హించుటకు అనుగ్రహించే వాడు
నిగ్రహః అసాధువులను శిక్షించి అణచి వేసే వాడు
వ్యగ్రః.. భక్తులరక్షణ యందు ఎప్పుడూ సిద్ధంగా ఆసక్తితో వుండేవాడు
నైక శృంగః అనేక శృంగ ములు రూపాలు కొమ్ములు గలవాడు
గదాగ్రజః. గదాధరుడైన లేక గడకు ముందు పుట్టిన వాడు కృష్ణుడు.
4.ఈశ్లోకము యెుక్క తాత్పర్యమును వివరించండి?
ఆయన సూర్యుని మాధ్యమం ద్వారా భూమిపై వర్షాన్ని కురిపిస్తాడు. ఆయన సత్ హృ దయులకు రక్షణ రూపంలో
వైభ వాన్ని అనుగ్రహాన్ని వర్షింప చేస్తాడు. అందుకే ఆయనను
తే జో వృషః అని పిలు స్తారు ఆయన అవయవా లన్నిటిపై తేజస్సు ,కాంతి వుంటాయి. అందుకే ఆయనను ద్యుతిధరః అని పిలుస్తారు. ఆయన ఆయుధ దారు లందరి లోనూ శ్రేష్టుడు అందుకే ఆయనను సర్వ శస్త్ర భృతాం వరఃఅని పిలుస్తారు

ఆయన తన భక్తులు సమర్పించే పువ్వు లు ,ఆకులు వంటి ఏ కానుకల నైనా సంతోషంగా స్వీకరిస్తారుఅందుకే ఆయనను ప్రగ్ర హః అని పిలుస్తారు. యింద్రియాలనే అడవిలో యింద్రియాలనే గుర్రాలు అదుపు తప్పి ప్రవర్తించినప్పుడు ఆయన తన శక్తితో అవసరమైన నియంత్రణలను ప్రయెాగిస్తారు.అందుకే ఆయనను నిగ్రహః అని పిలుస్తారు. ఆయన అంతు లేనివాడు. అమరుడు మరియు తన భక్తు లపై కురిపించే అనుగ్రహానికి కూడా అంతం లేదు. అందుకే ఆయనను వ్యాఘ్రః అనగా అంతు లేని దాత అని పిలుస్తారు.
వేదాలే నాలుగు శిఖ రాలు వున్నాయి.అందుకే ఆయనను నైకశృంగః అని పిలుస్తారు.తన శత్రు వులకుబాధ కలిగించడానికి ఆయనకు అనేక మార్గా లున్నాయి ఆయన ఒక మంత్రం లేదా ప్రార్ధన ముగింపు లో అవతరిస్తారు అందుకే ఆయనను గదాగ్రజః అని పిలుస్తారు
