భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..జనసేన పార్టీ నాయకులకు, శ్రేణులకు విజ్ఞప్తి:

Ammiraju Udaya Shankar.sharma News Editor…సోషల్ మీడియా వేదికగా విభిన్నమైన విషయాల పట్ల మాట్లాడే సమయంలో, పోస్టులు చేసేటప్పుడు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వాడే భాష, భావ వ్యక్తీకరణ విషయంలో పరిధి దాటవద్దని పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు దిశానిర్దేశం చేశారు. అనవసర విషయాలపై ఇష్టానుసారం భాషను ఉపయోగించి మాట్లాడటం సరికాదని స్పష్టం చేశారు. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో మాట్లాడే సమయంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు కచ్చితంగా పార్టీ నిర్దేశించిన మార్గ దర్శకాలు పాటించాలి.

పార్టీ అభ్యున్నతి, పార్టీ కోసం కష్టించి పనిచేసే జన సైనికులు, వీర మహిళల సంక్షేమం ఎల్లప్పుడూ అధ్యక్షుల వారి దృష్టిలో ఉంటుంది. సోషల్ మీడియాలో రకరకాల విష ప్రచారాలను తిప్పి కొట్టండి. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం,
మంగళగిరి

వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణల జోలికి వెళ్లవద్దు.

⁠పార్టీల సిద్ధాంతాలు , మార్గ దర్శకాలకి అనుగుణంగా స్పందించాలి.

ఏదైనా విషయం మీద మాట్లాడే సమయంలో ఆవేశాలకు లోను కావద్దు. అసభ్య పదజాలాన్ని వాడవద్దు.

మహిళలను గౌరవించి మాట్లాడాలి.

పార్టీ అంతర్గత అంశాల పట్ల సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం మాట్లాడరాదు. పార్టీ భావజాలాన్ని కించపరిచేలా మాట్లాడే వారిని పార్టీ ఉపేక్షించదు.

⁠పార్టీ క్రమశిక్షణకి విఘాతం కలిగించేలా, జనసైనికుల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసే వారిపై జాగ్రత్తగా ఉండండి. వారి ప్రభావానికి లోను కావొద్దు.

కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెట్టేలా మాట్లాడాలి.

⁠రాజకీయ శత్రువుల సోషల్ మీడియా ప్రచార వలలో పడొద్దు. పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టాలి.