భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..కోడూరు ఎంఈఓకు ఉత్తమ మండల విద్యాశాఖ అధికారి పురస్కారం
కోడూరు, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కోడూరు మండల విద్యాశాఖ అధికారి శ్రీ టి.వి.ఎం. రామదాసు గారు ఉత్తమ మండల విద్యాశాఖ అధికారి పురస్కారాన్ని అందుకున్నారు.
గనులు, భూగర్భ శాస్త్రం, ఎక్సైజ్ శాఖల గౌరవ క్యాబినెట్ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
2026–27 విద్యా సంవత్సరంలో కోడూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంపునకు శ్రీ రామదాసు గారు ప్రత్యేక శ్రద్ధ చూపారు. వేసవి సెలవుల్లో సైతం ఒక్కరోజు విరామం లేకుండా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను నిరంతరం ప్రోత్సహిస్తూ, ముందస్తు షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజూ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్లను నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజల్లో మరింత నమ్మకం పెంపొందించేలా ఉపాధ్యాయులను సమన్వయం చేస్తూ, ప్రతి పాఠశాలలో విద్యార్థుల చేరికలు పెరిగేలా ఆయన చేసిన అవిశ్రాంత కృషి, సమర్థవంతమైన పర్యవేక్షణ, అంకితభావం ప్రశంసలు అందుకుంది.
ఈ సేవలను గుర్తించి కృష్ణా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శ్రీ టి.వి.ఎం. రామదాసు గారిని ఉత్తమ మండల విద్యాశాఖ అధికారిగా ఎంపిక చేసి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యా శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు శ్రీ రామదాసు గారికి అభినందనలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో కోడూరు మండల ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
