భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.మహిళా రిజర్వేషన్ల అమలుకు అన్ని పార్టీలు కలిసి రావాలి: ప్రధాని….

మహిళా రిజర్వేషన్ల అమలుకు అన్ని పార్టీలు కలిసి రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అందాలని ఆకాంక్షించారు.

మహిళా బిల్లుకు సహకరించి, ఆ క్రెడిట్‌ను తీసుకోవాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. దేశాభివృద్ధికి జనగణన ఎంతో కీలకమన్న ప్రధాని మోదీ, పథకాల రూపకల్పనకు జనగణన సమాచారం కీలకమని స్పష్టం చేశారు.

జనగణనకు యువత సహకరించాలని కోరారు. ఢిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన ఈ విషయాలను ప్రస్తావించారు….