భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…శ్రీ వైయస్ జగన్ మీటింగ్ పాయింట్స్
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైయస్.జగన్ భేటీ
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ భేటీ
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ–మండలి సమావేశాలపై దిశానిర్దేశం చేసిన వైయస్.జగన్
ప్రజా సమస్యలపై గతంలోనూ పోరాడాం.. ఇప్పుడు కూడా మరింత గట్టిగా పోరాడాలి – వైయస్.జగన్
మండలి సభ్యులంతా సమావేశాలకు పూర్తి సన్నద్ధంగా ఉండాలి – వైయస్.జగన్
వైయస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు – వైయస్.జగన్
ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుంది – వైయస్.జగన్
ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సభలో మాట్లాడే సమయం హక్కుగా వస్తుంది – వైయస్.జగన్
ఆ హక్కు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేకనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు – వైయస్.జగన్
అందువల్ల అసెంబ్లీలో మనం చేయగలిగింది లేదు– వైయస్.జగన్
అసెంబ్లీలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలకు ఆధారాలు, సాక్ష్యాలతో నేను ప్రెస్మీట్లు పెడతా – వైయస్.జగన్
ప్రతి అంశంలోనూ ప్రజలకు నాణేనికి రెండోవైపు చూపిస్తాం – వైయస్.జగన్
కాని, మండలిలో మనకు బలం ఉంది.. ప్రజల తరఫున అక్కడ గట్టిగా పోరాడాలి – వైయస్.జగన్
డీఎస్సీపై…
డీఎస్సీ లీకేజీలు, అక్రమాలపై 74 రోజులుగా దాదాపు 10 రకాల కార్యక్రమాలు చేశాం – వైయస్.జగన్
డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి – వైయస్.జగన్
డీఎస్సీకి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలన్నింటినీ ఇప్పటికే ప్రజల ముందు పెట్టాం – వైయస్.జగన్
డీఎస్సీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగికే ఫస్ట్ ర్యాంకు రావడం చూశాం – వైయస్.జగన్
మెరిట్ లిస్టులు మారిన వ్యవహారాలు కూడా బయటపడ్డాయి – వైయస్.జగన్
డీఎస్సీ లీకేజీ ఎంతదూరం వెళ్లిందో పూర్తిగా తేలాల్సిందే – వైయస్.జగన్
సీబీఐ విచారణకు ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదు :
వీళ్లుంటే నిజాలు బయటకు వస్తాయా? – వైయస్.జగన్
డీఎస్సీ అక్రమాలపై కచ్చితంగా సీబీఐ దర్యాప్తు జరగాలి – వైయస్.జగన్
స్పోర్ట్స్ కోటా పేరుతో జీవోలు జారీ చేసి అక్రమాలకు తెరతీశారు – వైయస్.జగన్
పోటీ పరీక్ష లేకుండా, డీఎస్సీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి వచ్చింది – వైయస్.జగన్
ఆ తర్వాత మళ్లీ జీవోలు మార్చారు.. అంటే ముందు చేసినది తప్పని ఒప్పుకున్నట్టే కదా? – వైయస్.జగన్
ఇన్ని అక్రమాలు, ఆధారాలు కనిపిస్తున్నప్పుడు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే – వైయస్.జగన్
విద్యాశాఖ మంత్రి చంద్రబాబు కొడుకే అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విచారణలో నిష్పాక్షికత ఎక్కడ ఉంటుంది? – వైయస్.జగన్
సీబీఐ విచారణ ద్వారానే అసలు నిజాలు బయటకు వస్తాయి – వైయస్.జగన్
ఫీజు రియింబర్స్మెంట్ – వసతి దీవెన
13 త్రైమాసికాలుగా ఫీజు రియింబర్స్మెంట్ పెండింగ్లో ఉంది – వైయస్.జగన్
ఒక్కో త్రైమాసికానికి సుమారు రూ.700 కోట్ల చొప్పున రూ.9,100 కోట్లు పెండింగ్ – వైయస్.జగన్
వసతి దీవెన కింద మరో రూ.3,300 కోట్లు పెండింగ్ – వైయస్.జగన్
ఫీజు రియింబర్స్మెంట్, వసతి దీవెన కలిపి రూ.12,400 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది – వైయస్.జగన్
ప్రభుత్వం ఇచ్చింది రూ.2,900 కోట్లే.. ఇంకా రూ.9 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి – వైయస్.జగన్
బీసీల తలరాతలు మార్చే ఫీజు రియింబర్స్మెంట్ పథకాన్నే నిర్వీర్యం చేస్తున్నారు – వైయస్.జగన్
ఈ బకాయిలపై మండలిలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి – వైయస్.జగన్
చర్చ కోసం పట్టుబట్టాలి.. విద్యార్థుల తరఫున గట్టిగా పోరాడాలి – వైయస్.జగన్
రైతుల సమస్యలు

రాష్ట్రంలో రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి.. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు – వైయస్.జగన్
పంటలు వేసుకోమని చెప్పి 40 శాతం పెట్టుబడి పెట్టిన తర్వాత నీళ్లు ఇవ్వలేమంటున్నారు – వైయస్.జగన్
రైతులకు అండగా ఉన్న ఉచిత పంటల బీమాను కూడా ఎత్తివేశారు – వైయస్.జగన్
రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు.. వారి సమస్యలపై మండలిలో గట్టిగా పోరాడాలి – వైయస్.జగన్
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధానానికీ మంగళం పాడేశారు – వైయస్.జగన్
PPP పాలసీపై
కొత్త PPP పాలసీ చూస్తే ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’ అన్నట్టుగా ఉంది – వైయస్.జగన్
PPP ప్రాజెక్టులకు ప్రభుత్వమే Viability Gap Funding ఇస్తుందంటున్నారు – వైయస్.జగన్
ప్రైవేటు సంస్థ తీసుకునే రుణాలకు వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందంటున్నారు – వైయస్.జగన్
రాయితీలు కూడా ప్రభుత్వం ఇవ్వాలి.. ఆ తర్వాత ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేసుకోవచ్చంటున్నారు –…
