..భారత్ న్యూస్ అమరావతి..జానీ మాస్టర్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయిన సినిమా కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు అక్టోబరు 24న ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆ కేసులోని ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రాగా… జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ సతీష్‌చంద్ర మిశ్రలతో కూడిన ధర్మాసనం దాన్ని డిస్మిస్‌ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.