..భారత్ న్యూస్ అమరావతి.Ammiraju Udaya Shankar.sharma News Editor….పోలీస్ సిబ్బంది సమస్యల పై “పోలీస్ గ్రీవెన్స్ డే”

అనకాపల్లి

జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తన కార్యాలయంలో “పోలీస్ గ్రీవెన్స్ డే” నిర్వహించి సిబ్బంది నుండి విజ్ఞాపనలు స్వీకరించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తానన్నారు. “పోలీస్ గ్రీవెన్స్ డే” నిర్వహించుటలో భాగంగా సిబ్బంది వ్యక్తిగత వృత్తిపరమైన శాఖాపరమైన సమస్యలను తెలుసుకొని వారి నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించి అర్హమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.