భారత్ న్యూస్ విశాఖపట్నం..దేశంలోనే మొట్టమొదటి మహిళా బస్ డిపో

న్యూఢిల్లీ :

అయితే అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలో కూడా తమ హక్కులను పొందాలనే ఆలోచనతోనే ఈ డిపోను ప్రారంభించామని మంత్రి తెలిపారు.

దేశంలోనే మొట్టమొదటి మహిళా బస్ డిపో ప్రారంభమైంది.

ఢిల్లీలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ దీన్ని ప్రారంభించారు.

సరోజిని నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ డిపోలో పూర్తి స్థాయిలో మహిళ సిబ్బంది పని చేయనున్నారు.

ఈ డిపోకు సఖి డిపో అనే పేరు కూడా పెట్టారు.

డిపో మెనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది అందరూ కూడా మహిళలే.

ఇందుకోసం మొత్తం 225 మంది సిబ్బందిని కేటాయించామని పేర్కొన్నారు.