ఏలూరు జిల్లా ముదినేపల్లి:::21\11\2024::::(భారత్ న్యూస్ ) స్వాతంత్ర సమరయోధుల చరిత్రలను తెలుసుకుని జీవితాన్ని క్రమశిక్షణ,నీతి నిజాయితీలతో బాల్య వ్యవస్థనుండే అలవర్చుకోవాలన్న కొడాలి వినోద్ విజయవంతమైన 57 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ సందర్భం గా ముఖ్యఅతిథిగా విచ్చేసిన కైకలూరు నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ వీర మల్లు నరసింహారావు చే బహుమతి ప్రదానం జరిగినది.ఏ.పీ. టూరిజం డెవలప్మెంట్ డైరెక్టర్ కొడాలి వినోద్ సహకారంతో ఈ వారం రోజులు జరిగిన వివిధ రకాలైన పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులు లకు వినోద్ బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీవో. యద్దనపూడి రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి గ్రంథాలయాన్ని వచ్చి న్యూస్ పేపర్ చదివే అలవాటు చేసుకోవాలన్నారు.గ్రామ సర్పంచ్ నిమ్మగడ్డ కైకమ్మా అందరూ స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర లను తెలుసుకోవాలి అన్నారు.వికాస్ కాలేజీ ప్రిన్సిపాల నక్క కనక మోహన్ మాట్లాడుతూ ప్రస్తుతం కంపీటేటివ్ పోటీ పరీక్ష లకు కావాల్సిన విజ్జనం ఈ గ్రంథాలయాల్లో లభిస్తుంది అన్నారు.ముదినేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ వి.ఎస్. వీరభద్రరావు మాట్లాడుతూ ప్రస్తుత సమాజం లో జరిగే మో సాల పట్ల జాగ్రత్త గా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో గౌతమ్ స్కూల్ ఉపాధ్యాయులు కే. వెంకట సుబ్బారావు, ఎంపీడీవో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్.సుబ్బా రావు స్కూల్ టీచర్స్,బి.డీ.సి. సిబ్బంది,గ్రంథాలయ సిబ్బందిపాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు