ఏలూరు జిల్లా ముదినేపల్లి:::::20\11\2024:::(భారత్ న్యూస్ )::ముదినేపల్లి నాయి బ్రాహ్మణ సంఘం ప్రధమ వన సమారాధనకు విశేష స్పందన ఘనంగా నాయీబ్రాహ్మణ సంఘ వనసమారాధనను ముదినేపల్లి మండలంలోని 32 గ్రామాలలోని అందరు ఆత్మీయతను పంచుకుంటూ మండల నాయీబ్రాహ్మణ సంఘం వనసమారాధన ఘనంగా నిర్వహించారు. ముందుగా మంగళ వాయిద్యాలతో,భక్థి శ్రేద్దలతో శ్రీ రమాసమేత వీర వెంకట సత్యన్నారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించి కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు మండలంలో పలు గ్రామాల నుండి కుటుంబ సమేతంగా నాయీబ్రాహ్మణ సంఘీయులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు సండ్లూరి వెంకటేశ్వరరావు , దాలిపత్తి లక్ష్మీనారాయణ , కోసూరు రమణమూర్తి , పావులూరి హరికృష్ణ , గాజులపల్లి రాజశేఖర్ వనసమారాధనకు విస్తృత ఏర్పాట్లు చేశారు. అనంతరం వాయిద్య కళాకారులు నిర్వహించిన సంగీత కచేరి అందరిని అలరించింది. ఈ వనసమారాధనలో ఉమ్మడి కృష్ణాజిల్లా న నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చిలకలపల్లి నాగరాజు మచిలీపట్నం పార్లమెంట్ సంఘ సభ్యులు నాయి బ్రాహ్మణ సాధికారక సంఘ సభ్యులు అశోక్ కైకలూరు నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు విజయ్ సింగరాయపాలెం త్యాగరాజ ఆరాధన కమిటీ అధ్యక్షులు చింతగుంట నాగరాజు నాయీబ్రాహ్మణ సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
