..భారత్ న్యూస్ హైదరాబాద్….ఇతర రాష్ట్రాల వృద్ధులకూ.. ఆర్టీసీ ఛార్జీలో 25% రాయితీ వర్తింపు*
ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 60 ఏళ్లు నిండిన వృద్ధులకు అమలుచేస్తున్న టికెట్ ఛార్జీలోని 25% రాయితీ.. ఏ రాష్ట్రం వారికైనా వర్తిస్తుందని యాజమాన్యం స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీచేసింది.
ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్పోర్ట్, రేషన్ కార్డుల్లో.. ఏదైనా, ఏ రాష్ట్రంలో జారీచేసినా సరే..
వాటి ఆధారంగా రాయితీ వర్తింపజేయాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) అప్పలరాజు అన్ని జిల్లాల అధికారులు, 4 జోన్ల ఈడీలకు ఆదేశాలు జారీ చేశారు.
