..భారత్ న్యూస్ హైదరాబాద్….ఆర్టీసీ బస్సులకు కనీసం ఫాస్టాగ్ రీఛార్జ్ చేయట్లేదు
ఫాస్టాగ్‌లో డబ్బులు లేక టోల్ ప్లాజా వద్ద నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు
అలంపూర్ – పుల్లూరు టోల్ ప్లాజాలో గద్వాల ఆర్టీసీ డిపో బస్సులకు చెందిన ఫాస్టాగ్ పనిచేయలేదు.
దీంతో బస్సులన్నీ అక్కడే నిలిచిపోయాయి. హైదరాబాద్ వైపు నుంచి కర్నూలు, కర్నూలు వైపు నుంచి హైదరాబాద్ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న ఒకే డిపోకు చెందిన బస్సులు నిలిచాయి.
బస్సులకు ఉన్న ఫాస్టాగ్ పని చేయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని డ్రైవర్లు తెలిపారు.
సుమారు 17 బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు
కనీసం ఫాస్టాగ్‌లో డబ్బులు లేకపోవడం ఏంటి అని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు…
