భారత్ న్యూస్ విజయవాడ…ఝార్ఖండ్లో తొలి దశ పోలింగ్ ప్రారంభం.
ఝార్ఖండ్లో తొలి విడతతోపాటు 31 అసెంబ్లీ, ఒక లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రారంభమైంది.
తొలి విడతలో 15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది.
683 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పోలింగ్ కోసం 15,344 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
1.37 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 33 నియోజకవర్గాలకు సిక్కింలోని 2 నియోజకవర్గాలు ఏకగ్రీవం అయ్యాయి.
